ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలందించాలి
● డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు
కొడకండ్ల: ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలను పెంచాలని, ఏఎన్‌సీ నమోదులను పెంచుతూ వారికి వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలన్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డాక్టర్లు గంపల హరికృష్ణరెడ్డి, భారతి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న రాములు క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ సీజ్ చేశారు.


