పట్నంలో ‘పల్లె ప్రచారం’
దేవరుప్పుల: గ్రామపంచాయతీ ఎన్నికలు వస్తే చాలు పట్నంలో ఉండే వలస ఓటర్ల ప్రభావం ఇక్కడి అభ్యర్థుల ఓటమి గెలుపులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో నిత్యం పనిచేసే స్థానికులు బాహాటంగా ప్రచారంలో నిమగ్నమవుతారు. కానీ తటస్టులుగా ఉండే పట్నం ఓటర్లను ఎవరు ముందు పావనం చేసుకుంటే వారికే ప్రాధాన్యం ఇస్తారనేది సర్వసాధారణం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచే తొలుత పట్నం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం పేరిట అత్యధిక ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆధివారం సెలువు దినం కావడంతో మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో తమ ఊరి వారు ఉన్న ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు.


