ఓటుహక్కు ప్రజాస్వామ్య పునాది
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో, మూడో విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌లో ఆయా మండలాల్లో ఓటరుగా నమోదై, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తాము ఓటరుగా నమోదైన సంబంధిత మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ వారికి 9న, రెండో విడత పోలింగ్ వారికి 12న , మూడో విడత పోలింగ్ వారికి 15న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవడానికి ఉద్యోగులు తమ ఎన్నికల విధుల అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీతో పాటు (ఓటర్ ఐడీ) జిరాక్స్, ఏదైనా ఒక గుర్తింపు కార్డును జత చేసి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ స్టేజ్–2 ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారులు పాటించాల్సిన ముఖ్య సూచనలు వివరించారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్
కేంద్రం ఏర్పాటు
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


