అటొళ్లు ఇటు..ఇటొళ్లు అటు
దేవరుప్పుల: గ్రామ పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తమ ప్రాబల్యం నిరూపించుకునేందుకు ఫిరాయింపుల జోరు సాగిస్తున్నాయి. ప్రధానంగా గిరిజన గ్రామ పంచాయతీలను టార్గెట్ చేసుకున్నాయి. ఆదివారం ధర్మాపురం రెవెన్యూ పరిధి లక్ష్మణ్‌తండా పరిధి బీఆర్‌ఎస్ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సమక్షంలో ఉదయం చేరగా మధ్యాహ్నం కల్లా ఇదే తండా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరడం కొసమెరుపు. చిన్న గ్రామపంచాయితీల్లో ప్రధాన పార్టీలోని పలు సామాజికవర్గ అభ్యర్థులకు టికెట్ దక్కలేదనే అలకపాన్పు గమనించిన ఇరు పార్టీలు తమ పార్టీల్లోకి చేర్చుకుంటున్నాయి.
అటొళ్లు ఇటు..ఇటొళ్లు అటు


