పంపిణీపై ప్రత్యేక నిఘా
ప్రతీ పోలింగ్ వద్ద
నలుగురు పోలీస్ సిబ్బంది
పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన బందోబస్తు
మద్యం,
డబ్బు
జనగామ: జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల వెస్ట్‌జోన్ పరిధిలో నిర్వహించనున్న జీపీ ఎన్నికలు అత్యంత కీలక దశలోకి ప్రవేశించాయి. మొత్తం మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ల నిర్వహణపై పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలపై డీసీపీ రాజ మహేంద్రనాయక్ శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వెస్ట్‌జోన్ పరిధిలో జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన వర్ధన్నపేట, రాయపర్తి మండలాలు, అలాగే వెంకటాపురం, గరిమెల్లపల్లి గ్రామాలు కలుపుకుని 14 మండలాలు ఉన్నాయి. జనగామ జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాలు కలుపుకుని 300 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 197 సాధారణ, 143 సమస్యాత్మక జీపీలను గుర్తించాం.
ఓటర్లను ఆకర్షించే విధంగా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంది. జిల్లాలో 45 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 450 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నం. 5 గుడుంబా కేసుల్లో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసి 3 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నాం. బెల్ట్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేసి ఇప్పటి వరకు 729 మందిని రూ.లక్ష పూచీకత్తుతో తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశాం.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎక్కడ గొడవలకు దిగకూడదు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వా రితో పాటు గ్రూప్ అడ్మిన్‌పై కేసు నమోదు చేస్తాం.
పోలింగ్ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూంకు చేరేవరకు పటిష్టమైన బందోబస్తు చేపట్టేలా అన్ని రూట్లను సిద్ధం చేసుకున్నం. అన్ని మండలాల్లో ఏసీపీ ర్యాంకు అధికారులతో ప్రత్యేక నిఘా ఉంటుంది. మొత్తం మూడు విడతల్లో జరుగనున్న ఎన్నికల కోసం రెండు నుంచి మూడు వేల మంది పోలీసుల సిబ్బంది అవసరం ఉంటుందని అంచనా వేశాం.
పోలింగ్ రోజు కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే జనసంచారం అనుమతి. ఏజెంట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముందుగానే బూత్ వద్ద చేరుకోవాలి. అభ్యర్థులు, పార్టీలు, కార్యకర్తలు ప్రశాంతంగా ఎన్నికలను జరిపేలా సహకరించాలి. సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. ప్రజల సహకారంతో ఈ ఎన్నికలను విజయవంతం చేస్తాం. ప్రజల్లో ఎన్నికల భద్రతపై నమ్మకాన్ని పెంచుతూ, పోలీసుశాఖ సన్నాహకాలను స్పష్టంగా వివరిస్తోంది.
సాక్షి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న
వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతీ బూత్ వద్ద నలుగురు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, నిఘా ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశాం. మూడు విడతలకు సంబంధించిన పోలింగ్ రూట్లను మొత్తం రీసెర్చ్ చేసి రూట్ వారీగా పోలీసు ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నాం. మొదటి విడతలో చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో 168 జీపీల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. వీటి పరిధిలో 64 రూట్లు, 171 లొకేషన్లు, 1,536 వార్డుల పరిధిలో 59 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రెండవ విడతలో బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో 79 జీపీలు, 710 వార్డులు, 29 రూట్లు, 27 క్రిటికల్, 52 నార్మల్ కేంద్రాలు, మూడవ విడతలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో 79 పంచాయతీలు, 800 వార్డులు, 40 రూట్లు, 91 జీపీల పరిధిలో 38 క్రిటికల్, 53 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించాం.
జిల్లా వ్యాప్తంగా 133 రూట్లు,
143 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు
ప్రజల సహకారంతో ఎన్నికలు
శాంతియుతంగా నిర్వహిస్తాం..
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్
పంపిణీపై ప్రత్యేక నిఘా


