ఎంబీబీఎస్ విద్యార్థులకు హెచ్‌పీవీ టీకా
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం గర్భాశయ కేన్సర్ నివారణకు ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.జితేంద్ర పర్యవేక్షణలో హెచ్‌పీవీ మొదటి విడత వ్యాక్సినేషన్ వేశారు. 131 మంది ఎంబీబీఎస్ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకా వేసినట్లు వారు తెలిపారు. గర్భాశయ కేన్సర్ నుంచి మహిళలను రక్షించడంలో కీలకంగా భావించే ఈ టీకాపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యరంగంలో ఇలాంటి నిరోధక చర్యలు ఎంతో అవసరమన్నారు. విడతల వారీగా టీకా వేస్తామన్నారు.
రెండో విడతలో
ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం
తరిగొప్పుల/బచ్చన్నపేట/నర్మెట/జనగామ రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎ న్నికల్లో ఆరు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. తరిగొప్పుల మండలంలో 15 గ్రామపంచాయతీలు ఉండగా మాన్సింగ్‌తండా, కొత్తతండా పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ బోజ నపల్లి లావణ్య తెలిపారు. మాన్సింగ్‌తండా స ర్పంచ్‌గా కత్తుల కొమురయ్య, కొత్తతండా సర్పంచ్‌గా భూక్య సమ్మయ్య (ధనుష్) ఏకగ్రీవమయ్యారు. బచ్చన్నపేట మండలంలోని రామచంద్రాపూర్ సర్పంచ్ బొందుగుల నవీన్‌కుమార్ ఒకే నామినేషన్ ఉండగా ఏకగ్రీవమయ్యారని ఎన్నికల అధికారులు తెలిపారు. నర్మెట మండలంలోని ఇసుబాయితండా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. సర్పంచ్‌గా బానోత్ బాలాజీతోపాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అధికా రులు తెలిపారు. జనగామ మండలంలోని పెద్దతండా వై సర్పంచ్‌గా తేజావత్ నర్సింహా, ఎర్రకుంటతండాలో రమావత్ శ్రీకాంత్‌లు ఏకగ్రీవమయ్యారు.
విజిలెన్స్ అధికారుల
విచారణ
పాలకుర్తి టౌన్: మండలంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను వరంగల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు శనివారం పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్, వంట గది, భవన నిర్మాణ డిజైన్‌కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అనే దానిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2016–17లో భవన నిర్మాణానికి రూ.4.20 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, 18నెలల్లో పూర్తి చేయాల్సిన భవన నిర్మాణ పనులు 7 సంవత్సరాలైన పూర్తి చేయలేదన్నారు. అదనంగా మరో రూ.2.50కోట్లను చెల్లించారన్నారు. అయితే భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం తదితర అంశాలను గుర్తించినట్లు తెలిపారు. గురుకుల సొసైటీ భవన నిర్మాణ అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్‌స్పెక్టర్ రాకేష్, ఏఈఈ రవి, గురుకుల సొసైటీ భవన నిర్మాణ అధికారులు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థులకు హెచ్‌పీవీ టీకా


