అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
జనగామ: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు సమాజంలో మరింతగా ప్రాచుర్యం పొందేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వే సి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ అంబేడ్కర్ అణగారిన వర్గాలు, అట్ట డుగు స్థాయి ప్రజలు చదువు, ఉద్యోగం, రాజకీయాలు వంటి ప్రతీరంగంలో భాగస్వామ్యం కావాలంటే రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో బలంగా చెప్పిన తొలి వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆలోచనలతోనే దేశాభివృద్ధి: డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: అంబేడ్కర్ ఆలోచనలు, విలువలు దేశాన్ని ముందుకు నడిపే శక్తిగా నిలుస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం కేవలం ఒక గ్రంథం కాదని, ప్రతీ భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం ఇచ్చే జీవన విధానమన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పీసీసీ సభ్యుడు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణనాయక్, ఎర్రమల సుధాకర్, వేమల్ల సత్యనారాయణరెడ్డి, వంగాల కల్యాణి, రాజమౌళి, శ్రీనివాస్‌రెడ్డి, షరీఫ్, శ్రీనివాస్‌లు ఉన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి


