ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
జనగామ: జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో శనివారం రాత్రి నుంచి జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పల మండలాల్లో ప్రచారం ఊపందుకుంది. బచ్చన్నపేటలో 34 మంది సర్పంచ్, 40 మంది వార్డు అభ్యర్థులు విత్ డ్రా చేసుకోగా, ఒక సర్పంచ్, 35 వార్డుల పరిధిలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్మెట మండలంలో సర్పంచ్‌లు 61, 270 మంది వార్డు సభ్యులు బరిలో నిలువగా, 52 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనగామ మండలంలో ఇద్దరు సర్పంచ్‌లు విత్ డ్రా చేసుకోగా, 147, 20 మంది వార్డు సభ్యులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 698 మంది బరిలో నిలిచారు. పాలకుర్తిలో చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితా విడుదల చేయగా, నేడు(ఆదివారం) అప్పీల్‌కు అవకాశం ఇవ్వగా, ఈ నెల 8వ తేదీన అప్పీల్ పరిష్కారం, 9న నామినేషన్ల ఉపసంహ రణ, అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. పాలకుర్తిలో ప్రచారానికి మరో మూడు రోజులు మిగిలి ఉండగా, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గంలో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది.
ఊపందుకున్న ప్రచారం..


