జోరందుకున్న పల్లెపోరు!
● పాలకుర్తిలో ముగిసిన నామినేషన్ల పర్వం
● రాత్రి వరకు స్వీకరణ
● జనగామలో నేడు ఉపసంహరణ,
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
జనగామ: జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో రెండో విడత ఎలక్షన్ నిర్వహణలో భాగంగా ఈనెల 6న(శనివారం) నామినేషన్ల ఉపసంహరణ పూర్తికాగానే సర్పంచ్ ఎన్నికల ప్రచార జోరు మొదలుకానుంది. బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల నాలుగు మండలాల్లో అభ్యర్థులు తమ ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. సాయంత్రం అధికారులు గుర్తులు కేటాయించగానే కరపత్రాలు, పాంప్లెంట్లు, డోర్ స్టిక్కర్లు ముద్రించుకుని ఇంటింటా తిరిగే కార్యక్రమాన్ని వేగవంతం చేసుకుంటున్నారు.
ఉత్కంఠభరితంగా..
ప్రతిసారి కంటే ఈసారి ప్రచారపోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుందనే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లోని స్థానిక నేతలు, పలుకుబడి ఉన్న పెద్దలు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పాలకుర్తి మండలంలో శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. కాగా రాత్రి వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
రెండు ప్రాంతాల్లో..
స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. మొదటి విడతగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్‌కు సంబంధించి గ్రామాల్లో ప్రతీ అభ్యర్థి తమ బలాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. జనగామ జిల్లాలో స్టేషన్‌న్ ఘన్‌పూర్‌తో పాటు జనగామ నియోజకవర్గంలో రెండు ప్రధాన ప్రాంతాల్లో ప్రచారం వాడీ వేడీగా సాగనుంది.


