ఆమె సర్పంచ్.. ఆయన వార్డ్‌మెంబర్
● పంచాయతీ బరిలో దంపతులు
రఘునాథపల్లి: మండలంలోని శివాజీనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భార్యాభర్తలు బరిలో నిలిచారు. 503 మంది ఓటర్లు కలిగిన గ్రామంలో ఈసారి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా బీఆర్‌ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా భార్య మంచోజు శోభారాణి, 8వ వార్డు సభ్యుడిగా భర్త మంచోజు శ్రీనివాస్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి శివరాత్రి సంధ్య, 8వ వార్డు అభ్యర్థి పల్లపు లక్ష్మిలపై వారు పోటీ చేస్తున్నారు. గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి పెరిగింది.
వార్డుపోటీలో భార్యాభర్తలు
బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్ గ్రామంలో వార్డు సభ్యుల బరిలో భార్యభర్త పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన పోరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి నాలుగో వార్డులో, భార్య పోరెడ్డి కవిత రెండో వార్డులో వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు..ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి గ్రామస్తుల్లో పెరిగింది.
ఆమె సర్పంచ్.. ఆయన వార్డ్‌మెంబర్
ఆమె సర్పంచ్.. ఆయన వార్డ్‌మెంబర్
ఆమె సర్పంచ్.. ఆయన వార్డ్‌మెంబర్


