సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు
● డీసీపీ రాజామహేంద్ర నాయక్
దేవరుప్పుల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీసీపీ రాజామహేంద్ర నాయక్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆయన వెంట వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సై ఊర సృజన్‌కుమార్ ఉన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..
కొడకండ్ల: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. మండలకేంద్రంలోని టీజీఆర్‌ఎస్‌జేసీ గురుకులంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో డీసీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామ్‌రెడ్డి, ఎస్సై చింత రాజు, ఫ్రిన్సిపాల్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.


