బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
జనగామ రూరల్: బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నట్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దూడల సిద్ధయ్యగౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో వివిధ బీసీ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. అడహక్ కమిటీ చైర్మన్ సెవెల్లి సంపత్, వైస్ చైర్మన్ ధర్మపురి శ్రీనివాస్, సలహాదారులుగా కల్నల్ భిక్షపతి, కంచ రాములు, మంగళంపల్లి రాజు, జాయ మల్లేష్, పండుగ హరీష్ ముదిరాజ్, కొత్తపల్లి అభినాష్, సింగిరి ప్రశాంత్ యాదవ్‌తో పాటు ప్రతీ కులసంఘం నుంచి ఒక ప్రతినిధిని భాగస్వామ్యం కల్పించారు. రాబోయే రోజుల్లో స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.


