చల్లంగా చూడు నాగన్న
– మరిన్ని ఫొటోలు 9లోu
జనగామ గీతాశ్రమంలో పూజలు చేస్తున్న భక్తులు
● ఆలయాలకు
పోటెత్తిన భక్తులు
● జిల్లా వ్యాప్తంగా
నాగుల చవితి వేడుకలు
జనగామ: కార్తీక మాసం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భక్తులు శనివారం నాగుల చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలతో పాటు పట్టణంలోని పోచమ్మ ఆలయం, గీతాశ్రమం, బాణాపురం, గుండ్లగడ్డ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుట్ట వద్ద పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించి, నాగదేవతలకు పాలు పోసి ఆరాధించారు. శివాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల ఆరాధనతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు ఉపవాసంతో నాగదేవతలకు నైవేద్యాలు సమర్పించారు.
చల్లంగా చూడు నాగన్న


