పొరపాట్లు లేకుండా చూడాలి
జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించామన్నారు. ఇందులో ఏ కేటగిరీలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, బీ కేటగిరీలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, సీ కేటగిరీలో 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓట రు జాబితాలో నమోదు కాబడిన వారు, డీ కేటగి రీలో 2002–2007 మధ్యలో జన్మించిన వారీగా విభజించడం జరిగిందన్నారు. అన్ని కేటగిరీలు క లిపి సుమారు 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ బెన్షలోమ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
వీసీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్
సుదర్శన్ రెడ్డి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
పురోగతిపై సమీక్ష


