
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం.
– ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య
సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి