
గడువు పెంపు
మండలాల వారీగా వచ్చిన టెండర్లు
సెంచరీ కొట్టిన చిన్న పెండ్యాల..
అత్యధికంగా టెండర్లు వచ్చిన దుకాణాలు
అత్యల్పంగా టెండర్లు వచ్చిన దుకాణాలు
కలిసొచ్చేనా?
జనగామ: మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఆశించిన దానికంటే దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎకై ్సజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది. మద్యం దుకాణాల టెండర్లకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తక్కువగా రావడంతో ప్రభుత్వం ఈనెల 23వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇప్పటివరకు జిల్లాలో 1,587 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత సీజన్‌న్‌లో 2,492 దరఖాస్తులు రాగా, ఈసారి 899 తక్కువగా రావడం అధికారులు ఆందోళనకు గురి చేసింది. గడువు పెంచిన నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన మద్యం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
20 సంఖ్య దాటని పరిస్థితి..
జిల్లాలో 50 మద్యం దుకాణాల కేటాయింపులకు టెండర్లను స్వీకరిస్తున్నారు. గతనెల 26వ తేదీ నుంచి టెండర్లను తీసుకుంటుండగా, 18వ తేదీ వరకు వరకు చివరి అవకాశం ముగిసింది. ఎకై ్సజ్ శాఖ అధికారుల అంచనాలను మద్యం వ్యాపారులు, ఉత్సాహవంతులు తలకిందులు చేశారు. దరఖాస్తులు ఎందుకు తగ్గాయి.. గతంలో ఉన్న పోటీ లేకపోవడానికి గల కారణాలను ఎకై ్సజ్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. కొత్త పాలసీ, మద్యం డిపాజిట్ పెంపు, షాపుల సంఖ్య పెరగడం వంటి అంశాలు వ్యాపారులను వెనక్కి తగ్గించాయని చెబుతున్నారు. జిల్లాలో 11 షాపులకు 20 దరఖాస్తులు కూడా రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా గౌడ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన షాపులకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం అధికారులు సైతం ఆందోళనకు గురి చేస్తోంది. జనగామ మునిసిపల్ పరిధిలోని షాప్‌నెంబర్–1కు కేవలం 6 దరఖాస్తులు రాగా, షాపు నెంబర్–4కు 14, స్టేషన్‌ఘన్‌పూర్ 23 నెంబర్‌కు కేవలం 15 మాత్రమే వచ్చాయి.
ఐదు రోజుల సమయం..
మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణకు పెంచిన ఐదు రోజుల గడువు కలిసొచ్చేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 20వ తేదీన దీపావళి (సెలవు), 21న మంగళవారం(సగం అమావాస్య), 22న పాడ్యమి ఉండడంతో దరఖాస్తులు సమర్పించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో చివరి రోజు గురువారం 23న కొంతమేర టెండర్లు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులకు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని మద్యం దుకాణాలదారులు అంచనా వేస్తుండగా, తగ్గిన 899 వస్తాయని ఎకై ్సజ్ శాఖ గట్టి నమ్మకంతో ఉంది. గతంలో భారీగా టెండర్లు వేసిన వ్యాపారులను కలిసి టెండర్లు వేయాలని ఆ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పనిలో పనిగా కొత్త వారి నెంబర్లను సేకరిస్తూ స్వాగతిస్తున్నట్లు సమాచారం. మద్యం వ్యాపారంలోకి నూతనంగా వచ్చే వ్యాపారులు మరింత స్పందిస్తే పోటీ కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన రూ.47.79కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ, ఇది గత ఏడాది కంటే తక్కువే. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో, టెండర్ల గడువు పెంపుతో ఆదాయం కొంతమేర పెరుగుతుందనే ఆశ ఎకై ్సజ్ శాఖకు ఉంది. అయితే దీపావళి సెలవులు, వ్యాపారుల నిరుత్సాహం ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.
మండలం టెండర్లు
జనగామ మునిసిపల్ 214
జనగామ మండలం(పెంబర్తి) 30
లిం.ఘనపురం 129
నర్మెట 61
బచ్చన్నపేట 103
చిల్పూరు 147
స్టే.ఘన్‌పూర్ 155
తరిగొప్పుల 54
రఘునాథపల్లి 170
పాలకుర్తి 183
కొడకండ్ల 70
జఫర్‌గఢ్ 133
దేవరుప్పుల 144
18వరకు వచ్చిన దరఖాస్తులు 1,587
గతంకంటే 899 తక్కువ
ఇప్పటి వరకు ఆదాయం రూ.47.79కోట్లు
20 టెండర్ల కంటే తక్కువ వచ్చిన
షాపులపై వాటిపై ఎకై ్సజ్ ఫోకస్
27న లక్కీ డ్రా
చిల్పూరు మండలం చిన్నపెండ్యాల షాపు నెంబర్ 21(జనరల్)కు విపరీతమైన పోటీ నెలకొంది. వరంగల్ హైవేపై వరంగల్‌కు దగ్గరగా ఉండడంతో ఎప్పుడూ ఈ దుకాణానికి పోటీ ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18వ తేదీ వరకు సెంచరీ దాటి 103 దరఖాస్తులు రాగా, గడువు పెంచడంతో మరో 10 నుంచి 20 పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రఘునాథపల్లి 33 నెంబర్ (ఖిలాషాపూర్/నిడిగొండ)షాపు ఆఫ్ సెంచరీ దాటి 54 దరఖాస్తులు రాగా, దేవరుప్పుల 48 షాపునకు 51 మంది పోటీపడ్డారు.
దుకాణం టెండర్లు రిజర్వేషన్
నెంబర్
13 40 ఎస్సీ(లిం.ఘనపురం)
14 49 జనరల్(లిం.ఘనపురం)
15 40 గౌడ(లిం.ఘనపురం)
21 103 జనరల్(చిన్న పెండ్యాల)
33 54 జనరల్(రఘునాథపల్లి)
34 47 జనరల్(రఘునాథపల్లి)
45 46 జనరల్(జఫర్‌గఢ్)
48 51 జనరల్(దేవరుప్పుల)
49 45 గౌడ(దేవరుప్పుల)
50 48 జనరల్(దేవరుప్పుల)
01 06 జనరల్(మునిసిపల్)
02 18 గౌడ(మునిసిపల్)
04 14 గౌడ(మునిసిపల్)
06 16 గౌడ(మునిసిపల్)
23 15 గౌడ(స్టే.ఘన్‌పూర్)
26 15 గౌడ(స్టే.ఘన్‌పూర్)