
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్ల పేటెంట్ సీఎందే
స్టేషన్‌ఘన్‌పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పక అమలుచేయాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుందని, ఎప్పటికై నా బీసీ రిజర్వేషన్ల పేటెంట్ సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిధులుగా హాజరైన ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులు షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్‌యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితో కలిసి ముందుగా మీడియా సమావేశంలో కడియం మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు.
ఆసక్తి ఉన్నవారు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చు: ఏఐసీసీ పరిశీలకుడు పట్నాయక్
డీసీసీ అధ్యక్ష పదవి కోసం అర్హత, ఆసక్తి ఉన్నవారందరూ నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీశ్‌రెడ్డి, శివరాజ్‌యాదవ్, నాయకులు బెలిదె వెంకన్న, బేతి జయపాల్‌రెడ్డి, కనకం గణేశ్, అంబటి కిషన్‌రాజ్, నాగరబోయిన శ్రీరాములు, రజాక్‌యాదవ్, కొలిపాక సతీశ్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి