
ప్రోత్సాహం
ఉద్యాన పంటలకు
జనగామ రూరల్: జిల్లాలో ఉద్యాన పంటల సాగు ను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ సంవత్సరం పండ్ల తోటల సాగు తగ్గుముఖం పట్టడంతో రాయితీని పెంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,359 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఇందులో ఆయిల్‌పామ్ 7 వేల ఎకరాల్లో సాగవుతుండగా, ప్రభుత్వ రాయితీతో పాటు గిట్టుబాటు ధర కల్పించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇదే తరుణంలో మామిడి, అరటి తోటల సాగు తగ్గుతోంది. 600 ఎకరాల్లో కూరగాయల సా గు అవుతుండగా చాలా ప్రాంతాల్లో రైతులు పండ్ల తోటలను తొలగించి ఆయిల్‌పామ్ సాగు చేపట్టా రు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది.
డ్రాగన్ ఫ్రూట్‌కు అధిక రాయితీ
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం ద్వారా పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గతేడాది డ్రాగన్ ఫ్రూట్ కు హెక్టారుకు రూ.1,60,000 రాయితీ ఇవ్వగా ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచింది. బొప్పాయి సాగు కు గతేడాది ఇచ్చిన రూ.30 వేల రాయితీని కొనసాగిస్తోంది. మిర్చి, కూరగాయల సాగులో వాడుకునే మల్చింగ్‌కు ఈ ఏడాది రూ.20వేలకు పెంచింది. మూడేళ్లపాటు ఇదే రాయితీలను కొనసాగించనుంది. రైతులు సద్వినియోగం చేసుకు నేలా అధికారులు గ్రామాల్లో అవగా హన కల్పిస్తున్నారు.
లాభాలు వివరిస్తున్నాం..
ప్రభుత్వం ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో కంటే సాగు పెంచడానికి సబ్సిడీని పెంచింది. రైతులు పండ్ల తోటలు సాగు చేయడానికి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యానవన పంటల సాగు పద్ధతులు, లాభాలు వివరిస్తున్నాం.
– సందీప్, క్లస్టర్ హార్టికల్చర్ అధికారి
సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యాన పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా రాయితీలు పెంచింది. జిల్లాలో భూములు పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉన్నాయి. సంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగు లాభదాయకంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు హార్టికల్చర్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీధర్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి
మండలాల వారీగా సాగు వివరాలు
రాయితీని పెంచిన ప్రభుత్వం
ఎంఐడీహెచ్ పథకం ద్వారా అమలు
మూడేళ్ల పాటు సబ్సిడీ వర్తింపు
జిల్లాలో 9,359 ఎకరాల్లో
ఉద్యాన పంటల సాగు
మండలం ఎకరాల్లో
చిల్పూరు 719.89
స్టేషన్‌ఘన్‌పూర్ 1,076.45
లింగాలఘణపురం 643.06
రఘునాథపల్లి 535.77
జఫర్‌గఢ్ 515.79
బచ్చన్నపేట 1,435.81
జనగామ 1,714.38
నర్మెట 741.41
తరిగొప్పుల 219.95
దేవరుప్పుల 148.11
కొడకండ్ల 619.76
పాలకుర్తి 920.13
మొత్తం 9359.48

ప్రోత్సాహం

ప్రోత్సాహం