
ముసురుతోనే సరి
జనగామ
విద్యా కమిషన్‌కు
సమస్యల ఏకరువు
రాష్ట్ర విద్యాకమిషన్‌కు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, టీచింగ్, నాటీచింగ్ స్టాఫ్ సమస్యలు ఏకరువు పెట్టారు.
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
–8లోu
జనగామ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా జోరు వర్షాలు కురుస్తుంటే.. జిల్లాలో మాత్రం ముసురుతోనే సరిపెట్టేస్తుంది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ (మోస్తారు నుంచి భారీ వర్షాలు) ప్రకటించినప్పటికీ.. తేలికపాటి నుంచి మోస్తారు వర్షమే కురుస్తుంది. ఈ సీజన్‌లో వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి విత్తులు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే.. వరి నారుమళ్లు ఎండిపోయాయి. పత్తి సాగుకు సమయం ముగిసిపోగా.. వరినాట్లకు మరో వారం మిగిలి ఉన్నప్పటికీ.. సాగు అంచనాలో 50 శాతం దాటని పరిస్థితి. రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో జిల్లా వ్యాప్తంగా వరినాట్లు ఊపందుకున్నాయి. సాగు నీరందక రెండోసారి విత్తిన పత్తి గింజలు సైతం మట్టిలో కలిసి పోగా కొంతమంది రైతులు మూడో సారి విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు.
1.93 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో పత్తి, వరి, ఇతర పంటలు కలుపుకుని 3.54 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.15 లక్షల ఎకరాల్లో వరి, 1.25 లక్షల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3,500 ఎకరాల్లో కందులు తదిర పంటలు సాగు కావాల్సి ఉంది. సీజన్ ఆరంభం నుంచి వర్షాలు మొఖం చాటేయడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు పనులు ముందుకు కదలలేదు. దీంతో ఇప్పటి వరకు 1.02లక్షల ఎకరాల్లో పత్తి, 80,085 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పూర్తి చేయడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రస్తుతం తుపాన్ ప్రభావంతో రైతులు ఆశగా వరి సాగు పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా జూలైలో 272.9 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, ఇప్పటి వరకు 192.2 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండకపోవడం గమనార్హం.
సాగు ఆలస్యం..
నాట్ల పనులు చివరి దశకు చేరుకునే సమయంలో.. ప్రారంభమయ్యే విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా, అప్పటికే సిద్ధం చేసి ఉంచిన మళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. బోరు బావులపై ఆధారపడి సాగు చేసిన వరి, పత్తి పంటల్లో కలుపు తీయడం, గుంటుకలు కొట్టడం, ఎరువులు వేయడంలో రైతులు బిజీగా ఉన్నారు. వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. చిల్పూరు మండలంలో రెండు చెరువులు మాత్రం మత్తడి దూకుతున్నాయి.
సాగు వివరాలు (ఎకరాల్లో..)
సరాసరి
కురియాల్సింది272.9
కురిసింది <192.2
జూలైలో వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లు)
న్యూస్‌రీల్
రాష్ట్రమంతటా జోరువానలు
జనగామలో అంతంతే..
తుపాన్ ప్రభావంతో ఊపందుకున్న సాగు
పంట సాగు విస్తీర్ణం
పత్తి 1,02,423
వరి 80,985(సగం నారు దశలో)
కందులు 1,478
మొక్కజొన్న 7,976
పెసర 363
వేరుశనగ 50
జొన్న 30
మినుములు 12
బావి నీరే ఆధారం..
బావినీటిపై ఆధారపడి మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్న. కొద్ది రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో బావి కింద వరినట్లు వేయాలా.. వద్దా.. అని ఆందోళన ఉండేది. రెండు రోజుల నుంచి కొద్దిపాటి వర్షాలు కురుస్తుండడం, మరోవైపు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో నమ్మకం పెరిగిందిఆ. దీంతో సాగు పనులు మొదలు పెట్టిన. ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులకు మేలు.
– బైరి వెంకటేశ్వర్లు, జఫర్‌గఢ్, రైతు
దిగుబడి తక్కువ వచ్చే అవకాశం
కాలాన్ని బట్టి ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలే వరి పంటకు సిద్ధం చేసుకున్నా. కాలం కాకపోవడంతో నాట్లు వేయలేకపోయాం. మూడు రోజులుగా కురుస్తున్న ముసురులతో కాలాన్ని నమ్ముకుని పంట సాగు చేస్తున్న. ముదిరిన నారుతో దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది.
– లక్ష్మణ్ నాయక్, లక్ష్మణ్ తండా,
ధర్మపురం, దేవరుప్పుల

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి

ముసురుతోనే సరి