
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జఫర్‌గఢ్: ఆస్పత్రికి వచ్చే రోగులకు టెస్ట్‌లు నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంతోపాటు కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. వైద్యులు, వైద్య సిబ్బంది రిజిస్టర్లను పరిశీ లించారు. ఓపీ, టెస్టులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. టెస్టుల వివరాల నమోదులో అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు రిజిష్టర్‌లో సంతకాలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం పేషెంట్లతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. డయాలసీస్ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ వంట సామగ్రి పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట డీఈఓ భోజన్న, తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఎంఈఓ రఘునందన్‌రెడ్డి ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జనగామ రూరల్: జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీపై వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్ నితిన్‌లతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలపై చర్చించి, నివారణ చర్యలపై చ ర్చించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ ధరించా లన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలో మలుపుల వద్ద వాహన డ్రైవర్లకు రోడ్డు క్లియర్‌గా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద సమాచారమిచ్చేలా యువతకు అవగాహన కల్పించాలన్నారు. డీటీఓ జీవీఎస్ గౌడ్, పోలీసులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా