
నెట్‌బాల్‌లో బంగారు పతకాలు
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
జనగామ: తమిళనాడు రాష్ట్రం సేలంలో ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగిన సౌత్ జోన్ నేషనల్ నెట్‌బాల్ పోటీల్లో పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వి ద్యార్థులు బంగారు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వైష్ణవి, అక్షయ, మంగ సునైనా, శ్రుత కీర్తి, అర్చనలను కలెక్టర్ రి జ్వాన్ బాషా బుధవారం అభినందించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యువజన, క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా నెట్‌బాల్ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కోచ్ రవి కుమార్ ఉన్నారు.
న్యూస్‌రీల్

నెట్‌బాల్‌లో బంగారు పతకాలు