
పరిశీలన.. పర్యవేక్షణ
వినతుల వెల్లువ
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో కేంద్రమంత్రులు
● పలు విభాగాలను తిరుగుతూ
పనుల పురోగతిపై ఆరా
● పనులు సంతృప్తికరమన్న కేంద్ర
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..
● 40 ఏళ్ల కల నెరవేరుతోందన్న
మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
● కాజీపేటలో మంత్రులకు
ఘనస్వాగతం.. కిక్కిరిసిన జంక్షన్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిలు శనివారం పరిశీలించారు. యూనిట్‌లోని పలు విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ వారి పర్యటన సాగింది. పలు విభాగా ల్లో పనుల పురోగతిపై కేంద్రమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదినాటికి యూనిట్ నుంచి మా న్యుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా సివిల్ కన్‌స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వరంగల్ జిల్లావాసుల 40 ఏళ్ల సాకారమవుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎంపీ సీతా రాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారావు, అరూరి రమేశ్ ఘనస్వాగతం పలికారు.
రోడ్డుమార్గంలో అయోధ్యపురం యూనిట్‌కు..
కాజీపేట జంక్షన్ నుంచి కేంద్రమంత్రులు నేరుగా రోడ్డుమార్గంలో అయోధ్యపురంలోని యూనిట్‌కు చేరుకున్నారు. మొదట మంత్రులు రైల్వే యూనిట్ లే అవుట్ రూంకు వెళ్లి లే అవుట్‌ను పరిశీలించారు. అనంతరం కాన్ఫరెన్స్‌హాల్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైల్వే యూనిట్ పనుల పురోగతి, కెపాసిటీని స్థానిక రైల్వే అధికారులు వివరించారు. తర్వాత వాహనాలపై రైల్వే యూనిట్ నిర్మాణ షాపులు, ట్రాక్‌లను తనిఖీ చేసుకుంటూ మెయిన్ షాప్ సమీపానికి చేరుకున్నారు. అక్కడినుంచి షెడ్లను తనిఖీ చేశారు.
కార్మికులతో మాటామంతి..
యూనిట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మాట్లాడారు. పనులు ఎలా సాగుతున్నాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఓ కార్మికుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా రైల్వే యూనిట్ సమీపంలో గల అయోధ్యపురం రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక రైలులో మంత్రులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌రావు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, డీఆర్‌ఎం భర్షీష్‌కుమార్ జైన్, సీఎంపీఈసీ మధుసూదన్‌రావు, సీని యర్ డీఎస్టీఈ ప్రియా అగర్వాల్, సీసీఓఎం పద్మజ, సీనియర్ డీసీఎం షిఫాలి, ఆర్‌వీఎన్‌ఎల్ ఎలక్ట్రికల్ జీఎం ఆనంద్ చెక్కిల, ఈఎం మెకానికల్ వంశీ, సీపీఎం సాయిప్రసాద్, పీఈడీ మెకానికల్ మనీష్‌అగర్వాల్, సీపీఆర్వో ఎ.శ్రీధర్ పాల్గొన్నారు.
గంట ఆలస్యంగా పర్యటన..
కేంద్ర మంత్రులు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు రావాల్సి ఉంది. కానీ, గంట ఆలస్యంగా 2:40 గంటలకు కాజీపేటకు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. మంత్రులు రాగానే వారిని కలిసేందుకు పోటీపడగా స్వల్ప తోపులాట జరిగింది. పుష్పగుచ్ఛాలు కిందపడ్డాయి. తాము మంత్రులను కలవలేకపోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వే యూనిట్‌లో పనులను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, నాయకులు ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ తదితరులు
– 8లోu

పరిశీలన.. పర్యవేక్షణ

పరిశీలన.. పర్యవేక్షణ