
సాగునీరు విడుదల చేయకుంటే ధర్నా
దేవరుప్పుల/పాలకుర్తి టౌన్: దేవాదుల సాగునీరు విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట మహాధర్నా చేపడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. శుక్రవారం దేవరుప్పుల మండలం మాధాపురం నుంచి సాగునీటి కాల్వ గుండా పాలకుర్తి మండలం గూడూరు వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఎర్రబెల్లికి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వ్యవసాయం రంగం పురోగతికి సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో అధికారులు నిద్రవస్థలో పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు దేవాదుల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా 360 రోజులు నీళ్లు అందించామని, మూడు నెలల ముందే సమీక్షలు చేసి చెరువులు నిండుకుండాల నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరుప్పుల, పాలకుర్తి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని పాదయాత్రకు సంఘీభావం పలికా రు. అంతకుముందు ఓ మహిళా రైతు తను తెచ్చుకున్న సద్దన్నాన్ని ఎర్రబెల్లికి తినిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్‌రాంమిరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్‌సింగ్, మాజీ ఎంపీపీలు కొల్లూరి సోమన్న, బస్వ మల్లేషమ్, గడ్డం రాజు, మంగలంపల్లి శ్రీనివాస్, పసునూరి నవీన్, శ్రీనివాస్‌రావు, నవీన్‌నాయక్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు