
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
స్టేషన్‌ఘన్‌పూర్: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నా రు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాలను శుక్రవారం నిర్వహించారు. డీఆర్‌డీఓ వసంతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళా శక్తి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే అందిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికంగా మ హిళలకు ఉపయోగపడేవే ఉన్నాయన్నారు. అనంత రం 5,682 స్వయం సహాయక సంఘాలకు రూ.17. 36 కోట్ల వడ్డీలేని రుణాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ నూరోద్దీన్, డీపీఎంలు సతీష్, ప్రకాష్, శ్రీనివాస్, నళినినారాయణ, ఏఎంసీ చైర్‌పర్సన్ లావణ్య, అధికారులు పాల్గొన్నారు.
అప్పులున్నా..ప్రజా సంక్షేమం ఆగదు
చిల్పూరు: గత పాలకుల అవినీతితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకు మించి అప్పుల భారం ఉన్నా.. ప్రజా సంక్షేమం మాత్రం ఆగదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీఎస్ ఓ సరస్వతి అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి