
విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకే గ్రంథాలయాలు..
జనగామ రూరల్: గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి.భోజన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ గురుకుల పాఠశాల ఆవరణలో మైసూర్‌లోని కేంద్ర భారతీయ భాషల సంస్థ, సమగ్ర శిక్ష సౌజన్యంతో జిల్లాలోని 271 ప్రభుత్వ ప్రాథమిక, 63 ప్రాథమికోన్నత, మొత్తంగా 334 పాఠశాలలకు 115 టైటిల్స్‌తో కూడిన గ్రంథాలయ పుస్తకాలను అందించారు. అనంతరం వాటిని డీఈఓ చేతుల మీదుగా బచ్చన్నపేట మండలానికి పంపించారు. అనంత రం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యావికాసాన్ని దృష్టిలో ఉంచుకుని లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, డీసీఈబీ సెక్రటరీ చంద్రభాను, సీఎంఓ నాగరాజు, పాఠశాల (యూఆర్‌ఎస్) ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్, సీఆర్‌పీలు యాదయ్య, శ్రీనివాస్, రామచందర్, సిబ్బంది కనకయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.
పుస్తకాల పంపిణీలో డీఈఓ భోజన్న