
సుందరీకరణ పనుల్లో నాణ్యత లేదు
జనగామ: జనగామ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం రైల్వేస్టేషన్ పనులు, ట్రెయిన్ల హాల్టింగ్‌కు సంబంధించి కొద్దిసేపు చర్చించారు. జిల్లాతోపాటు సమీప ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది ఇక్కడకు వచ్చి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. జనగామ రైల్వేస్టేషన్‌లో శాతవాహన, చార్మినార్, షిర్డీ, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేయిస్తున్న పనుల్లో నాణ్యతకొరవడిందని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించే విధంగా పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, తోకల హరీష్, రవి, రాజా, నాయకులు చంద్రం, లగిశెట్టి వీరలింగం, శివకృష్ణ, కాసుల శీను, పానుగంటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకలు అజహరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్