
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
జనగామ రూరల్: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వరంగల్ నార్కోటిక్స్ ఏసీపీ సైదులు అన్నారు. గురువారం మండలంలోని పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాలలో యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అవయవాల మీద డ్రగ్స్ ప్రభావం పడి జీవితం అగమ్యచోచరంగా మారుతుందని వివరించారు. యువత, విద్యార్థులు మత్తుకు బానిసలు కాకూడదని తెలిపారు. చెడు అలవాట్లుకు పోకుండా చదువుపై దృష్టి పెట్టాలని సమాజాభివృద్దికి పాటుపడాలని తెలిపారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేస్తామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జనగామ సీఐ దామోదర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, బచ్చన్నపేట స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత అధ్యాపకులు పాల్గొన్నారు.
నార్కోటిక్స్ ఏసీపీ సైదులు