
దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ
జఫర్‌గఢ్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో జిల్లాలో తొలిసారిగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు ఇచ్చిన పాపనపోలేదన్నారు. జిల్లాలో 9,700 కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాగా 14,780 మంది కొత్త సభ్యుల చేర్పులు, మార్పులు జరిగాయన్నారు. ఇంకా కొత్త రేషన్‌కార్డు రాని వారు ఎవరైన ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ రేషన్‌కార్డుల పంపిణీతో నిరుపేదల చిరకాల వాంచ నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లావణ్యశిరీష్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్డీఓ వెంకన్న, తహసీల్ధార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జఫర్‌గఢ్‌లో కలెక్టర్‌తో కలిసి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ