
దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి
జనగామ రూరల్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలన్నారు. ఇందుకు సరిపడు సిబ్బందిని ని యమించుకొని దరఖాస్తులను పరిష్కరించాలన్నా రు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ గూగుల్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట: భూభారతిలో భూ సమస్యలకు కోసం చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు.
వీసీలో సీసీఎల్‌ఏ కమిషనర్
లోకేష్ కుమార్