
కలెక్టరేట్‌ను సందర్శించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
జనగామ: జనగామ సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం సందర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌తో కలిసి రికార్డులను భద్ర పరిచే గదితో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు. శాఖల వారీగా కేటాయించిన చాంబర్‌లకు సంబంధించిన వివరాలను కలెక్టర్ వివరించారు. ఇటీవల న్యాస్ ఫలితాల్లో దేశంలో ఎంపికై న 50 జిల్లాల్లో జనగామకు 50వ స్థానం దక్కిందని వివరించగా, ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముందస్తుగా చేపట్టిన పూర్తి వివరాలను వెల్లడించారు. న్యాస్‌లో మంచి ఫలితాలను సాధించేందుకు పాఠశాలలో రోజు వారీగా అమలు చేసిన కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (ఏసీ) పింకేష్ కుమార్, రోహిత్‌సింగ్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఈఓ భోజన్న తదితరులు ఉన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
● డీఈఓ భోజన్న
బచ్చన్నపేట: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. సోమవారం మండలంలోని ఆలింపూర్ గ్రామంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారిని సెక్షన్లుగా విభజించాలన్నారు. ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు స్కూ ల్ యూనిఫామ్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించ డం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం స్వర్ణతార, ఉపాధ్యాయులు మమత, నర్సమ్మ, బాలకిషన్, విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ను సందర్శించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ