
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఆర్యవైశ్యులు వాణిజ్య, వ్యాపారాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్‌కుమార్ అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని మా గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణిస్తూ తమ సత్తా చాటాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఉన్న చోట పోటీ చేయాలన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వాణిజ్య, వ్యాపారాలకే పరిమితం కాకుండా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, రానున్న రోజుల్లో రాజకీయాల్లోనూ సత్తా చాటాలన్నారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్ను నర్సింహులు, నాయకులు బెలిదె వెంకన్న, పార్శి కమల్‌కుమార్, బెజుగం భిక్షపతి, తెల్లాకుల రామకృష్ణ, పార్శి రంగారావు, గౌరిశెట్టి శ్రీని వాస్, పాలకుర్తి సోమశేఖర్, పాలకుర్తి శ్రీనివాస్, జొన్నల రాజేశ్వరరావు, సరాబు ఆంజనేయులు, రవీందర్, వరూధిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్