
సీఎంఆర్‌ను సకాలంలో అందించాలి
జనగామ రూరల్: రబీ, ఖరీఫ్ 2024–25కు గాను సీఎంఆర్‌ను సకాలంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రేషన్ కార్డులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి తహసీల్దార్లు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాలను అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్‌ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఖరిఫ్ (వానాకాలం) 2024–25 సీజన్ కు సంబంధించి 91827.554 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 73664.210 మెట్రిక్ టన్నుల బియ్యం, 80.22శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 18163.344 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. రబీ (యాసంగి) 2024–25 సీజన్‌కు సంబంధించి 144834.216 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 38135.916 మెట్రిక్ టన్నుల బియ్యం, 26.33శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 106698.300 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. కొత్తరేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబందించి ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సివిల్ సప్లయీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా