సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

Jul 12 2025 9:39 AM | Updated on Jul 12 2025 9:39 AM

సంక్ష

సంక్షిప్త సమాచారం

పరామర్శ

పాలకుర్తి: ఇటీవల కాలుకి ఆపరేషన్‌ చేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వావివాలకు చెందిన రాష్ట్ర దివ్యాంగుల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల సత్యనారాయణను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం పరిమర్శించారు. అలాగే గ్రామంలో మృతి చెందిన కూనబోయిన కోమురయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావులసతీష్‌, అనపర్తి యాకూబ్‌లను పరామర్శించారు. అలాగే పాడిశెట్టి మహేందర్‌ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

నివాళి

జనగామ: జనగామ పట్టణ సీనియర్‌ జర్నలిస్టు మాదంశెట్టి శివకుమార్‌ తల్లి మనమ్మ (90) మృతి చెందింది. కాగా, శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గంగిశెట్టి ప్రమోద్‌ కుమార్‌, కోశాధికారి బెజుగం భిక్షపతిలు మనమ్మ మృతదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు.

తండాలను బమ్మెరలో చేర్చాలి

పాలకుర్తి: 2018 వరకు బమ్మెర ఎంపీటీసీ స్థానంలో ఉన్న తమ తండాలను బమ్మెరలోనే చేర్చాలని గిరిజన సంఘం నాయకుడు రమేష్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఎన్నిక

రఘునాథపల్లి: మండలంలోని దాసన్నగూడెం గ్రామానికి చెందిన బొక్క రామచంద్రయ్య టీడీపీ మండల అధ్యక్షుడిగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల మల్లేష్‌, రాష్ట్ర నాయకులు ఎండీ జహంగీర్‌, ఉమ్మగోని నర్సయ్యల సమక్షంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు సత్తయ్య, తానాజీ, ఈర్యానాయక్‌, మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నర్సింగరావు, ప్రచార కార్యదర్థి వీరస్వామి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బండి సంజయ్‌ జన్మదిన వేడుకలు

జఫర్‌గఢ్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ జన్మదిన వేడుకలను బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లుపంపిణీ చేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోచయ్య సేవలు మరువలేనివి

బచ్చన్నపేట: కొన్నె గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వేముల పోచయ్య మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్‌ అన్నారు. శుక్రవారం పోచయ్య మృత దేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కొడవటూర్‌ దేవస్థాన చైర్మన్‌ మల్లారెడ్డి, జంగిటి విద్యానాథ్‌, వెంకట్‌రెడ్డి, ఎల్లయ్య, బాలకిషన్‌గౌడ్‌, ఆగయ్య, సిద్దిరాములు, అంజి, మహేందర్‌, బిక్షపతి, చంద్రయ్య ఉన్నారు.

శ్రీనివాస్‌జీ సేవలు..

దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా బడుగుల అభ్యున్నతి కోసం పాటుపడిన శ్రీనివాస్‌జీ సేవలు మరువలేనివని తెలంగాణ గిరిజన కార్పొరేషన్‌ స్టేట్‌ మాజీ చైర్మన్‌ మోహన్‌ గాంధీనాయక్‌ అన్నారు. శుక్రవారం కడవెండి పడమటి తోట ప్రాంగణం వద్ద మాజీ సర్పంచ్‌ అస్నాల శ్రీనివాస్‌జీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్థూపానికి కుటుంబ సభ్యులు తదితరులు నివాళులర్పించారు.

‘స్థానికం’లో కాంగ్రెస్‌ సత్తా చూపాలి

కొడకండ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సత్తాను చూపాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ధరావత్‌ సురేష్‌నాయక్‌ కోరారు. శుక్రవారం హక్యతండాలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

తహసీల్దార్‌ను కలిసిన నాయకులు

రఘునాథపల్లి: రఘునాథపల్లి తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫణికిషోర్‌ను శుక్రవారం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్‌ కార్యాలయంలో బొకేలు, శాలువాలతో సత్కరించారు. మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కోళ్ల రవి, మేకల నరేందర్‌ ఉన్నారు.

ఆర్థికసాయం

జఫర్‌గఢ్‌: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన పేద విద్యార్థిని యాతం సంధ్యారాణికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అన్నం బ్రహ్మారెడ్డి పంపిన రూ.5 వేల సాయం మాజీ ఎంపీటీసీలు ఇల్లందుల స్రవంతి మొగిళి, బాదవత్‌ దేవేందర్‌నాయక్‌ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ సంధ్యారాణి ఇంటర్‌ ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించి ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచిందన్నారు. పై చదువులకు బ్రహ్మారెడ్డి ఆర్థికసాయం అందజేయడం అభినందనీయమన్నారు. మాజీ వార్డు సభ్యులు కాట సుధాకర్‌, ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి..

బచ్చన్నపేట: అనారోగ్యంతో బాదపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు తేలుకంటి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు సామాజిక సేవా కర్త కోడూరి శివకుమార్‌ గౌడ్‌ రూ. 5వేల సాయం అందజేశారు.

క్రీడాకారిణికి..

చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న క్రీడాకారిణి కోల సాయిప్రియ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. కాగా, సాయిప్రియకు చిల్పూరు ఆలయ చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు శుక్రవారం ఆర్థికసాయం పంపగా హెచ్‌ఎం పెనుమాటి వెంకటేశ్వర్లు అందజేశారు. హెచ్‌ఎం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొన్న సాయిప్రియ ప్రతిభ కనబరిచి ఆగస్టులో బిహార్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుకు వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్‌సింగ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, చిర్ర వెంకటేశ్వర్లు, జీడి ఆనందంలు కృతజ్ఞలతు తెలిపారు.

కాల్వకు మరమ్మతు

చిల్పూరు: సాగునీటి సమస్యను పరిష్కరించాలని పల్లగుట్ట గ్రామానికి చెందిన చిల్పూరు ఆలయ చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో రైతులు ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాగా, శుక్రవారం అధికారులు గ్రామంలోని బర్రెంకల చెరువు నుంచి వెంకటాద్రి చెరువు వరకు వెళ్లే కాల్వకు పొక్లెయినర్‌తో మరమ్మతు పనులు చేయించారు.

పాఠశాల అభివృద్ధికి సహకరించాలి

బచ్చన్నపేట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎలగందుల బార్గవి–శేఖర్‌ దంపతులు రూ.5వేల విరాళం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

‘బీఆర్‌ఎస్‌ దిగజారుడు

రాజకీయాలు మానుకోవాలి’

కొడకండ్ల: ఉనికిని కాపాడుకొనేందుకై బీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బ్లాక్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ధరావత్‌ సురేష్‌నాయక్‌ అన్నారు. రామేశ్వరం గ్రామ పరిధిలోని పలుగుల తండాకు చెందిన ఎస్టీ సెల్‌ నాయకులు సురేష్‌నాయక్‌, నరేష్‌నాయకులు శుక్రవారం తిరిగి సొంతగూటికి చేరగా వారు కండూవాలు కప్పారు. కార్యక్రమంలో శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు

దేవరుప్పుల: మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు అనివార్యమని ఎస్సై ఊర సృజన్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం గొల్లపల్లిలో వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరిస్తున్న తీగల వెంకన్న పై కేసు నమోదు చేశామని, ట్రాక్టర్‌ సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు.

సంక్షిప్త సమాచారం1
1/1

సంక్షిప్త సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement