
ఘనంగా ‘పల్లా’ జన్మదిన వేడుకలు
సాక్షి నెట్‌వర్క్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం దానం చేశారు. ప్రముఖ వైద్యుడు పగిడిపాటి సుధసుగుణాకర్‌రాజుతో పాటు పలువురు రక్తదానం చేశారు. అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.