
మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ: జనగామ పురపాలికలో ప్రభుత్వ స్థలా లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలో రోడ్లపై పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, ఎంక్రోచ్‌మెంట్లపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఏఎస్పీ పండరి నితిన్ చేతన్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ స్వరూప, ఏఈ మహిపాల్‌తో కలిసి నె హ్రూపార్కు ఏరియాను సందర్శించారు. రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్, రోడ్ల ఆక్రమణలకు సంబంధించి ఆరా తీశారు. సిద్దిపేటరోడ్డు నెహ్రూపార్క్ వద్ద ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కంట్రోల్ పనులకు సంబంధించి ఏఎస్పీతో చర్చించారు. అక్కడ నుంచి హైదరాబాద్ బైపాస్ వరకు చేపట్టిన 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను అధికారులను అ డిగి తెలుసుకున్నారు. విస్తరణలో భాగంగా విద్యుత్ ఫోల్స్‌ను పక్కకు జరిపేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ రూట్‌లో వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు