
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి
జనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ గానుగపహడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్మెట, జనగామ, తరిగొప్పుల మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలు బ్రిడ్జి వద్ద వంటావార్పు, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. నా యకులు సాయన్న, చొప్పరి సోమన్న, చెల్లూరు మల్లేశం, తేజవతి విజయ, పండుగ నిర్మల, యాదలక్ష్మి, పులి కృష్ణ, ఊదర వెంకటాద్రి, ఎం. సుదర్శనం, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.