
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రంను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తొమ్మిది రోజు ఊరూరా పురవీధుల్లో పీరీల (షావర్ల) పండుగ సందడి కనిపించింది. జనగామ జిల్లా కేంద్రంతో పాటు లింగాలఘణపురం, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట, చిల్పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో పీరీలను ఊరేగింపు నిర్వహించారు. సీతారాంపురంలో మాజీ ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేషమ్ దంపతులు షావర్లకు కుడుకలు, జట్టీలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
మరిన్ని ఫొటోలు 9లో..