ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు

Jul 7 2025 6:27 AM | Updated on Jul 7 2025 6:27 AM

ఘనా, నీలపతాక క్రమాల్లో  అమ్మవారికి పూజలు

ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. ములుగు కలెక్టర్‌ దివాకర టీఎస్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement