
పన్నులతో పురపాలికకు ఆదాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజు ప్రణాళిక కార్యక్రమంలో పురపాలికకు పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆయన సందర్శించి కొలతలు తీసుకున్నారు. అనంతనం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 15,574 అసెస్‌మెంట్లు, ఉండగా ఇందులో 12,841 నివాస గృహాలు, 1,088 నివాసేతర గృహాలు, 1,645 మిక్స్‌డ్ భవనాలు ఉండగా, ఏటా ఆదాయం రూ.5.67 కోట్ల డిమాండ్ ఉందన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో 2,730 గృహాలను రీ అసెస్‌మెంట్ చేయగా, రూ.44.89 లక్షల డిమాండ్‌కు పెరగడం జరిగిందన్నారు. ఇంకా నూతన అసెస్‌మెంట్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2025–26 వార్షిక సంవత్సరంలో 2,125 దుకాణాల పరిధిలో కొలతలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న 65 గృహాలను గుర్తించి, వాటిని ఆన్‌లైన్ నుంచి తొలగించడం(వీటి ద్వారా రూ.28.43 లక్షలు కోల్పోయారు) జరిగిందని, కొత్తగా నిర్మాణం చేసే సమయంలో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కమిషనర్ వెంకటేశ్వర్లు, పులి శేఖర్ తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్