
నిబద్ధత గల నేత కొణిజేటి రోశయ్య
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: నిబద్ధత గత నాయకుడు కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంగా, గవర్నర్‌గా పనిచేసి పరిపాలన దక్షుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహోన్నతమైన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఉద్యోగులు కొణిజేటి రోశయ్యను ఆదర్శంగా తీసుకొని విధుల్లో అంకితభావం, విధేయత చూపాలని సూచించాఉ. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.