
అభివృద్ధికే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు
జనగామ రూరల్: పాఠశాల అభివృద్ధి.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల స్కూల్ కౌన్సిల్ ఎన్ని కలను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించారు. జూన్ 30వ తేదీన పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా ఫలితాలను జూలై 1న వెల్లడించి గురువారం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులతో డీఈఓ భోజన్న ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీ లను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కూడా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోనే చదువుకొని డీఈఓ స్థాయికి ఎదిగినట్లు గుర్తు చేసుకున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవరచుకొని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నరసింహులు గౌడ్ పాల్గొన్నారు.
డీఈఓ భోజన్న