
చర్య తీసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్‌పై దాడి చేసిన మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఉద్యోగుల అధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై ఈనెల 2న వైస్ చైర్మన్ చేసిన దాడిని ఖండిస్తూ టీఎన్‌జీఓల మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం నాయకుల పిలుపుమేరకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం మార్కెట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన్ను భాస్కర్ మాట్లాడారు. మార్కెట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వైస్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.