ఉత్సాహంగా వ్యాసరచన పోటీలు
జనగామ రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ‘ప్లాస్టిక్ కాలు ష్యాన్ని ముగిద్దాం’ అనే అంశంపై నిర్వహించి న వ్యాస రచన పోటీలో 18 మంది, చిత్రలేఖ నం పోటీలో 14 మంది జిల్లాలోని 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను డీఈఓ భోజన్న సందర్శించి విద్యార్థులను అభినందించారు. వ్యాసరచనలో మనోజ్ఞ, శ్రీ కార్మెల్ కాన్వెంట్ స్కూల్ పాలకుర్తి ప్రథమ స్థానం, పి.అక్షయ, కేజీబీవీ బచ్చన్నపే ట ద్వితీయ స్థానం, ఎం.సంయుక్త, జెడ్పీఎస్‌ఎస్ ధర్మకంచ తృతీయ స్థానం, కె.నందిని, కేజీబీవీ స్టేషన్‌ఘన్‌పూర్ నాగులో స్థానంలో నిలిచారు. చిత్రలేఖనంలో టి.సహస్ర సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల పాలకుర్తి ప్రథమ, సీహెచ్.శివ ద్వితీయ, టి.గణేష్, లింగాలఘణ పురం మోడల్ స్కూల్ తృతీయ, కన్సోలేషన్ బహుమతికి జి.శ్రీ విద్య, కేజీబీవీ స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపికయ్యారు. వీరికి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన బహుమతులు అందించనున్నారు.
విత్తనాల పంపిణీపై విచారణ
బచ్చన్నపేట : స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా జరిగిన విత్తనాల పంపిణీపై పాలకుర్తి ఏడీఏ పరశురాంనాయక్ బృందం ఆధ్వర్యాన బుధవారం విచారణ చేపట్టారు. రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జీలుగ విత్తనా లను ఆ షాపు యజమాని పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఆ విత్తనాలను తొర్రూరు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకుని విచా రించగా బచ్చన్నపేట నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడైంది. అందులో భాగంగానే ఆగ్రోస్ షాపు ల్యాప్‌టాప్, విత్తనాల విక్రయ, స్టాక్ తదితర రికార్డులను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీ నం చేసుకుని ఆ దుకాణాన్ని సీజ్ చేసి అందులోని జీలుగ విత్తనాలను వేరే ప్రదేశానికి తరలించారు. విచారణలో భాగంగా కొడవటూర్, బసిరెడ్డిపల్లి, సదాశివపేట గ్రామాల్లో జీలుగ విత్తనాలు తీసుకున్న రైతుల నుంచి వివరాలు సేకరించి అవి ఎక్కడ విత్తారో పంట పొలాల వద్దకు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. కొడవటూర్ రైతులకు 35 బస్తాల జీలుగ విత్తనాలు విక్రయించినట్లు రికార్డులో ఉండగా.. అక్కడ కేవలం ఏడుగురు రైతులకు ఏడు బస్తాలు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడైందని సమాచారం. మరో రెండు రోజుల పాటు అధికారుల బృందం విచారణ చేపట్టనుంది.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
జనగామ రూరల్: క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం ధర్మకంచలోని మినీ స్టేడియంలో చేపట్టారు. అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపగాని సుగుణాకర్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, అలాగే భవిష్యత్‌లో మంచి కళాశాలలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్నత విద్యకు అవకావం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మనోజ్‌కుమార్, ట్రెజరర్ అశోక్‌కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కై రిక హనుమంతరావు, సంతోష్‌కుమార్, బన్నీ, రామచంద్రం, పోరిక విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ర్యాపిడ్’ ఫోర్స్ కవాతు
జనగామ: జిల్లా కేంద్రంలో బుధవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యాన ఏఎస్పీ పండేరి చేతన్‌నితిన్ నేతృత్వంలో నెహ్రూపార్కు నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు చేపట్టిన ఈ కవాతులో.. శాంతి భద్రల పరిరక్షణలో మేమున్నామంటూ ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ బృందం ప్రజలకు తెలియ జేసింది. అత్యవసర సమయంలో ప్రజలను కాపాడుతు న్న తీరును వివరించింది.
ఉత్సాహంగా వ్యాసరచన పోటీలు
ఉత్సాహంగా వ్యాసరచన పోటీలు


