రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ
జనగామ రూరల్: కక్షిదారులు పంతాలకు, పట్టింపులకు పోకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని రాజీమార్గమే రాజామార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. అదివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌లో 4 నాలుగు బెంచ్‌ల ద్వారా కక్షిదారుల కేసులను పరిష్కరించారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, చిట్‌ఫండ్స్ మేనేజర్లు కక్షిదారులతో సమావేశంలో ముందుగా బీఎస్‌ఎన్‌ఎల్ సెంట్రల్ బ్యాంక్ కేసులను పరిష్కరిస్తూ అవార్డును ప్రదానం చేశారు. మొదటి బెంచ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, సభ్యురాలిగా కె.సునీతారాణి, రెండో బెంచ్ సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, సభ్యురాలిగా బి.స్వప్న, మూడో బెంచ్‌కు జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, సభ్యురాలిగా టి.భవాని, నాలుగో బెంచ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప సభ్యురాలిగా ఎన్.కళ్యాణి నేతృత్వం వహించారు. మోటార్ యాక్సిడెంట్ కేసులో కక్షిదారులకు 13.50లక్షల అవార్డును ప్రదానం చేశారు. లోక్ అదాలత్‌లో మోటార్ యాక్సిడెంట్ కేసులు 10, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు 3,139, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్, 377 కేసులు మొత్తం 3,516 కేసులకు గాను రూ. 2,05,09,828 వసూలు చేశారు.
జీడికల్‌లో జిల్లా జడ్జి ప్రత్యేక పూజలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం జిల్లా జడ్జి బి.ప్రతిమ, సబ్‌కోర్డు జడ్జి సుచరిత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు భార్గవాచార్యులు, మురళీధరాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జడ్జిలకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భరత్, మల్లేశం తదితరులు ఉన్నారు.
రాజీమార్గమే రాజమార్గం


