కేటీఆర్..నియోజకవర్గానికి రా!
● నేనంటే ఏంటో తెలుస్తుంది..
● సర్పంచ్‌ల సన్మాన సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: ‘మాజీమంత్రి కేటీఆర్‌కు అహంకారం, బలుపు ఎక్కువ.. నన్ను, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆడా, మగా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.. ఒక్కసారి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు నేను ఆడ, మగా అనేది తెలుస్తుంది..’అని మాజీ మంత్రి కేటీఆర్‌పై స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చి గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడారు.. కేటీఆర్ తండ్రి కేసీఆర్ కన్నా వయస్సులో పెద్దవాడినని, కేసీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేస్తే తాను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేశానన్నారు. తండ్రి వయస్సున్న తన గురించి కేటీఆర్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 143 మంది సర్పంచ్‌లకు 100 మంది సర్పంచ్‌లను గెలిపించుకున్న మగాడినినన్నారు. నియోజకవర్గంలో గత 15ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అభివృద్ధిని పట్టించుకోలేదని, గోకుడు, గీకుడు, చిలిపిచేష్టలతో నియోజకవర్గ పరువును తీశారని ఎమ్మెల్యే కడియం విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేసిన పంచాయతీ వ్యవస్థను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, జాతీయ గ్రామీణఉపాఽధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, వైస్ చైర్మన్ ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు బూర్ల శంకర్‌ముదిరాజ్, బెలిదె వెంకన్న, జగదీష్‌చందర్‌రెడ్డి, దుంపల పద్మారెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి. రజాక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


