గాంధీ జ్ఞాపకాలను చెరిపివేసే క్రుట
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరును చెరిపివేసే కుట్రలో భాగమే ఉపాధి హామీ పథకానికి ఆయన పేరు తొలగించడమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం పేరులో గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి నారాయణనాయక్, ఎర్రమల్ల సుధాకర్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వంగాల కళ్యాణి మల్లారెడ్డి, లింగాల నర్సిరెడ్డి, గాదెపాక రాంచందర్, ఉడుత రవి, బక్క శ్రీనివాస్, జమాల్‌షరీఫ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం
జనగామ: అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మైత్రేయ కూచిపూడి, కరాటే కళాక్షేత్రం ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుంచి బతకమ్మకుంట వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ కుంటలో వివేకానంద సేవా సమితి కార్యదర్శి దొంతుల శేఖ ర్, ఎస్‌పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ మాట్లాడుతూ.. ధ్యానంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో సంతోషం నిండేలా మార్చేస్తుందన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం ఫౌండర్ పులిగిల్ల సుఖేష్, నిడిగొండ చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ వాంకుడోతు అనిత, రిటై ర్డ్ ఎంఈఓ వంగాల రాజేందర్, దొంతుల శ్రీని వాస్, బల్ల రామ్మో హన్, మల్లికార్జున్, వీరస్వామి, అడ్వకేట్ కానుగంటి శృతి పాల్గొన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికిగాను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా డీసీఓ పి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తును ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు రుసుము రూ.100 ఉందని జనవరి 21వ తేదీ దరఖాస్తు చేసుకొ నేందుకు చివరి అవకాశం ఉందన్నారు. ప్రవేశ పరీక్ష జనవరి 22 తేదీ ఉదయం 11 గంటల నుంచి 1గంట వరకు జిల్లా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
గాంధీ జ్ఞాపకాలను చెరిపివేసే క్రుట


