పల్లెపాలనలో పట్టభద్రులు
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● తాజా పంచాయతీ ఎన్నికల్లో
సర్పంచ్‌లుగా పలువురి ఎన్నిక
● విజేతల్లో న్యాయవాదులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు
● గ్రామాభివృద్ధికి పునరంకితం
అవుతామని హామీ
● విద్యావంతుల ఏలుబడిలో గ్రామాల్లో వెలుగులు!
ప్రజాసేవ–కుటుంబపోషణ
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచి సర్పంచ్‌గా గెలుపొందా.. కుటుంబ పోషణ, ఉద్యోగం, ప్రజాసేవలను సమాంతరంగా కొనసాగిస్తా. తండా అభివృద్ధిపై ప్రజాసేవకే అంకితం.
– మౌడ్ మౌనిక, సర్పంచ్, లోక్య తండా, నర్మెట
అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం
పీజీ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేదాన్ని..భర్త సూచనతో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందా.. గ్రామ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా..
– గుగ్గిళ్ల నవిత, సర్పంచ్,
నేలపోగుల,లింగాలఘనపురం
అంకితభావంతో పనిచేస్తా..
బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మెగా కంపెనీలో సీఎన్జీ గ్యాస్ విభాగంలో ఇంజనీర్‌గా పని చేశా. కన్న ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఉద్యోగాన్ని వదులుకున్నా.. నాకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా..ఇటీవల జరిగిన సర్వేయర్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచా..ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తా.
–గుగులోత్ రాకేశ్ నాయక్, సర్పంచ్, నీలిబండ తండా,కొడకండ్ల
అభివృద్ధి వైపు నడిపిస్తా..
ఎంబీఏ వరకు చదువుకున్న.. ఇటీవల నీవన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న.. అనంతరం రాజకీయ రంగంలో అడుగుపెట్టా. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నా.
– నలిమెల అనిత, సర్పంచ్,చిల్పూర్
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని
ధర్మంగా పాటిస్తా
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశా. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థిగా విజయం సాధించా.. గ్రామాభివృద్ధితో పాటు ప్రజాసేవకు నా వృత్తి ధర్మాన్ని అంకితం చేస్తా..
– పగిడిపాటి రాజు, సర్పంచ్, ఆగాపేట,నర్మెట
అభివృద్ధిలో ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తా..
ఎంఏ, బీఈడీ చదివా.. గ్రామసేవలో ముందుండి బీఆర్‌ఎస్ రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించా. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తా.
–గాదెపాక విష్ణు, సర్పంచ్, కొత్తపల్లి, లింగాలఘణపురం
జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆయా మండలాల పరిధిలో ఉన్నత విద్య, వృత్తి, మంచి పేరును సంపాదించిన పట్టభద్రులు పెద్దఎత్తున విజయం సాధించారు. ఎమ్మెస్, బీటెక్ సివిల్ ఇంజనీర్‌లు, హైకోర్టు న్యాయవాదులు ప్రజల మద్దతుతో ఎన్నికై తమ గ్రామాలకు సేవ చేయాలని సంకల్పంతో బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా పోటీ చేసిన వారు కొందరు.. మరికొందరు ఏకగ్రీవంగానూ ఎన్నిక కావడం గమనార్హం. ఉన్నత విద్యతో పాటు ప్రజాసేవపై ఆసక్తి కలిగిన వీరు రాబోయే ఐదేళ్లలో గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తామని శపథం చేశారు. పల్లె ప్రగతిలో తమ శక్తి, అంకితభావం, నైపుణ్యాన్ని వినియోగించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల బలోపేతానికి పనిచేస్తామని కొత్త సర్పంచ్‌లు హామీ ఇస్తున్నారు. పట్టభద్రుల విజయంతో గ్రామాల్లో కొత్త ఆశల వెలుగులు మెరుగుతున్నాయి. – జనగామ
అభివృద్ధికి మారుపేరుగా మారుస్తా
ఎంఏ,ఎల్‌ఎల్‌బీ ఉన్నత విద్యను అభ్యసించి, హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పనిచేశా. న్యాయవాద వృత్తిలో మానవత్వాన్ని చాటుకుంటూ సేవలు అందించా. రాజకీయ ఖైదీల విడుదలలో జనరల్ కార్యదర్శిగా, పౌర హక్కుల సంఘం నేతగా అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నా. గ్రామాభివృద్ధి కోసం పోటీచేసి 550 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా..
– బల్ల రవీంద్రనాథ్, సర్పంచ్, కట్కూర్, బచ్చన్నపేట
అమెరికా నుంచి వచ్చి..
ఏకగ్రీవమయ్యా
అమెరికాలో ఎమ్మెస్ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేశా. గ్రామాభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో రామచంద్రపూర్ గ్రామ మొదటి పౌరుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా.. గ్రామ సమస్యల పరిష్కారమే నా ధ్యేయం.
– బొందుగుల వినోద్ కుమార్, సర్పంచ్,
రామచంద్రపూర్, బచ్చన్నపేట
విజయం గ్రామానికి అంకితం..
ఎంబీఏ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేదాన్ని.. అత్త పద్మ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉద్యోగాన్ని వీడి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించా.. నెలకు రూ.1.50లక్షల సాలరీతో పనిచేస్తూ, భర్త ప్రవీణ్‌గౌడ్ సూచన మేరకు ఉద్యోగం వదిలి సర్పంచ్‌గా బరిలో నిలిచి మొదటిసారే ఘన విజయం సాధించా.. కుటుంబ త్యాగంతో వచ్చిన ఈ విజయాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తా..
– కోతి స్రవంతి, సర్పంచ్, కోల్కొండ, దేవరుప్పుల
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు
పల్లెపాలనలో పట్టభద్రులు


