
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్‌రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్‌రెడ్డి.. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్‌కు బయలు దేరాడు. 2005 సంవత్సరంలో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్‌కు ఎంపికై న వెంకట్‌రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్‌లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభా గంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్‌తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి తనలోని సంతోషం.. ఆనందాన్ని వ్యక్తం చేశారు.