జనగామ రూరల్: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ.షరీఫ్, ఇప్ప రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ భోజన్నకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఓను సంఘం జిల్లా కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి డీటీఎఫ్ డైరీ, జీఓల పుస్తకం అందజేశారు. ఈ కార్యక్రమంలో చొక్కయ్య, శ్రీనివాస్, యాదయ్య, శివరాం, దివాకర్‌రెడ్డి, జగ్గారెడ్డి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
గోవులను రక్షించాలి
జనగామ: గోరక్షణ చట్టాలను అమలు చేసి గోవుల రక్షణకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏసీపీ పండేరే చేతన్ నితిన్‌కు వివిధ అంశాలతో కూడిన వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గోవధశాలలను మూసివేసి, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు.
టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలి
విద్యారణ్యపురి: త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణకు డిస్ట్రిక్ట్ రిసోర్స్‌పర్సన్ (డీఆర్పీ)లు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కోరారు. ఐదురోజులుగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస్‌లో రాష్ట్రస్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా రిసోర్స్‌పర్సన్ల కు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. సమావేశంలో ఎస్‌సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డినేటర్లు ఎల్లయ్య, గణపతి, రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రథంగాపాణిరెడ్డి పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జి
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటా పురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదా లు, ఆశీర్వచనం అందజేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వివరించగా.. రామప్ప శిల్పకళాసంపద బాగుంద ని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి