
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలి టీ సమగ్రాభివృద్ధికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో శుక్రవారం మున్సిపాలిటీ అఽధికారులు, స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యర్థాల సేకరణ, నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, చెత్త సేకరణ కు స్వచ్ఛ ఆటోలు, చెత్తకుండీల ఏర్పా టు, డ్రెయినేజీల శుభ్రత, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితరాలు వెంటనే చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లు, అదనంగా అవసరమైతే అంచనాలు సిద్ధం చేయాలని, అంతర్గత పైపులైన్లు వేయాలని చెప్పారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, కాలనీల్లో వీధి దీపాలు, ఇంటింటికీ మీటరు, కూడళ్లలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లులో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి గ్రామాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.